Facebook Twitter
పెనుప్రమాదం ముందుంది జాగ్రత్త..!

1...

కళ్ళలో నీళ్ళు 

సుళ్ళు తిరిగే వేళ 

అడుగులు ముందుకేయకు 

పడిపోయే...ప్రమాదముంది 

నమ్మించి మోసంచేసే 

నయవంచకులతో 

విచ్చలవిడిగా తిరగకు

చెడిపోయే...ప్రమాదముంది

కట్టుకున్నోడు 

కాల్ చేస్తే కట్ చేసి 

మూడోవ్యక్తితో ముచ్చట పెట్టకు

విడిపోయే...ప్రమాదముంది 

2...

ఆనందంగా

పరమానందంగా ఉండగా 

అదిచేస్తా ఇదిపొడుగ్టఖఖఖఖ్యఠ్యకకక్స్కస్తా 

అరచేతిలో స్వర్గాన్నిచూపిస్తా 

అమావాస్య రోజు చంద్రున్ని రప్పిస్తానంటూ

ఏ ప్రమాణాలు చేయకు... 

ఏరు దాటాక తెప్ప 

తగలేసే...ప్రమాదముంది

నిరాశతో ఉన్నప్పుడు 

ఏ నిర్ణయాలు తీసుకోకు...

ఆ తప్పుడు నిర్ణయాలతో ఆ ప్రతికూలఫలితాలతో తలతిరిగి

తలబొప్పికట్టే...ప్రమాదముంది

కోపంతో ఉండగా 

ఏ సమాధానాలు చెప్పకు...

అప్పుడు మన మనసంతా 

కారు మబ్బులు కమ్మిన ఆకాశం 

చీకటే తప్ప వెలుగుండదు...

ఆవేశమే తప్ప ఆలోచనుండదు... 

సమస్యలతో 

సతమతమౌతున్న వేళ 

కుమిలిపోకు...క్రుంగిపోకు... 

సహనంతో సాహసంతో 

ముందుకు సాగితేనే కదా... 

ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా 

చిటికెలో పరిష్కారం చిక్కేది...