Facebook Twitter
ముద్దు ముద్దు..! వద్దు వద్దు..!!

ముద్దు ముద్దు... 

పాలలా 

పొంగే మనసు... 

వద్దు వద్దు... 

ఒక్కదెబ్బకు 

కృంగే మనసు...

కుమిలే మనసు... 

విరిగే మనసు...

విలపించే మనసు... 

ముద్దు ముద్దు...

ప్రేమించే మనసు...

దీవించే మనసు... 

వద్దు వద్దు...

ద్వేషించే మనసు...

విభజించే మనసు... 

విషం చిమ్మే మనసు... 

ముద్దు ముద్దు...

ఆశలు చిగురించే మనసు...

వెన్నెలలా ప్రకాశించే మనసు... 

కుసుమంలా వికసించే మనసు...

వేకువ కిరణంలా వెలిగే మనసు...