ఉండాలి..! ఉండాలి..!!
ఉండాలి ఉండాలి...
మనకు...ఆదరించే అనురాగం
ఆప్యాయత కురిపించే హృదయం
ఉండాలి ఉండాలి...
మనకు...తక్షణమే స్పందించే
ఆపదలో సహాయం అందించే మనసు
పిలిచే హృదయం కన్న
తలిచే హృదయం మిన్న...
ఆ తలిచే హృదయం కన్న
వలచే హృదయం మిన్న...
ఆ వలచే హృదయం కన్న
కొలిచే హృదయం మిన్న...
ఓ పరమేశ్వరా నాకట్టి మంచి హృదయాన్ని ప్రసాదించండి తండ్రీ..!
కోపంతో...క్రోధంతో
అసూయతో...ద్వేషంతో
నిత్యం మరిగే మనసు కన్న...
ప్రేమతో...దయతో...జాలితో
కరుణతో కరిగే మనసు మిన్న...
ఓ పరమేశ్వరా..! నా కట్టి మంచి మనసును ప్రసాదించండి తండ్రీ..!



