జీవితం ఒక వింత...పాలపుంత
ఔను ఈ భూగోళంలో
ఈ మనిషి జీవితం ఒక వింత..!
అది ఖగోళంలో సైతం
అంతుచిక్కని ఒక పాలపుంత..!
నేడు ఒక బలహీనుడు
రేపు ఒక బాహుబలి..!
నేడు ఒక బికారి భిక్షగాడు
రేపు ఒక బిల్ గేట్స్..!
ఒక రోజు ఇంట
చిరునవ్వుల చినుకులు..!
ఒక రోజు కంట
ఆగని కన్నీటి ధారలు..!
ఎందుకీ సంతాపాలు..?
ఏమిటీ సంతోషాలు సంబరాలు..?
ఒక రోజు ఎవరెస్టు శిఖరం పైకి
ఒక రోజు అథఃపాతాళానికి...
ఒక రోజు నేలో ధూళిలో పడిపోతాం..!
ఒక రోజు లేచి లేడిలా పరుగులు తీస్తాం..! ఎక్కడివీ అనుభవాలు..?
ఎవరు నేర్పినవీ పాఠాలు గుణపాఠాలు..?



