మాటల మాంత్రికుల
కొందరు మన
శ్రేయోభిలాషులు
మనల్ని పొగుడుతూ ఉంటే...
మనకు భజన చేస్తూ ఉంటే...
మన ఆనందం వర్ణాతీతం...
మనం
ఊగిపోతాం...
ఉప్పొంగి పోతాం...
ఉబ్బితబ్బిబ్బౌతాం..
అలా అలా
గాలిలో...నీలాల నింగిలో
నీలిమేఘాలలో తేలిపోతాం...
ముసిముసి
నవ్వులు నవ్వుతాం...
చిరునవ్వులు చిందిస్తాం...
ఆనందంతో చిందులు వేస్తాం...
వినోదంతో విందులు చేసుకుంటాం...
ఆనంద డోలికల్లో ఉయ్యాలూగుతాం...
అది వారి సంస్కారం...
అది వారి సమయస్ఫూర్తి...
అది వారి చతురత చాకచక్యం...
కారణం వారు
మనకు తెలియని
మనలోని అనేక సుగుణాలను
గుర్తించి...గుర్తుపెట్టుకొని...
పదిమందికి...వివరంగా
వినసొంపుగా...చెబుతూఉంటే
మన ఆనందం వర్ణాతీతం...
మనం
ఊగిపోతాం...
ఉప్పొంగి పోతాం...
ఉబ్బితబ్బిబ్బౌతాం..
మనం అనంతలోకాల్లో ఊరేగుతాం...



