శిలలు...శిల్పాలు...
కొందరు మన
శ్రేయోభిలాషులు
మనకు సంబంధించిన
అతిచిన్న విషయాల్ని
అతిగొప్ప విషయాలుగా
వర్ణించి...ఊరించి...ఊరించి
ఊహకందని రీతిలో...
నమ్మశక్యంకాని రీతిలో...
కమ్మని కథలుగా చెబుతూవుంటే...
వీక్షకులు ప్రేక్షకులు పరవశంతో
చప్పట్లు కొడుతూఉంటే...
మనం
ఊగిపోతాం...
ఉప్పొంగి పోతాం...
ఉబ్బితబ్బిబ్బౌతాం..
అది వారి సంస్కారం...
అది వారిలోని
ప్రేమతత్వానికి ప్రతిరూపం...
అది వారిలోని
మంచితనానికి...మానవత్వానికి...
వారి స్వచ్ఛమైన వ్యక్తిత్వానికి...
నిలువెత్తు నిదర్శనం...
మనం వారి చేతిలో శిలలం...
మన గౌరవం మన గొప్పతనం
మన కీర్తి ప్రతిష్టలు వారు
చెక్కిన సజీవ సుందర శిల్పాలు.
వారే మాటల మాంత్రికులు...
వారే హృదయాలను రంజింపజేసి
మనల్ని ఏదో తెలియని మత్తులో
మాయలోముంచే ఇంద్రజాలికులు...



