Facebook Twitter
సుఖజీవన సృష్టికర్త..?

శిల్పిచేతిలో ఎన్నో వేలసార్లు 

ఉలిదెబ్బలు తింటేనే కదా..! 

ఒక శిల...సుందర శిల్పంగా మారేది..!

నిన్న...కన్నకల...నేడు సాకారమయ్యేది..!

మదిలో...ఆనందపు అల...ఎగిసిపడేది..!

ఒక్క చూపుకే 

మనిషిని కట్టిపడేసేది..!

మనసు పరవశింపజేసేది..!

ఎన్నిసార్లు తిలకించినా తనివితీరనిది..!

కనువిందు కలిగించేది..!

దైవమై గర్భగుడిలో పూజలందుకునేది..! 

పేగులు ఎండాక...ఆకలిని...

పరుగెత్తాక...తీరని దాహాన్ని...

ఓడిపోయాక... 

ఘోరఅవమానాన్ని......సహించేవాడే..!

క్రింద పడ్డాక...తగిలిన

మొండిగాయాల్ని........తట్టుకునేవాడే..!

కట్టుకున్నాక...భార్య 

ఎంతటి గయ్యాలిదైనా....భరించేవాడే..!

నిజం తెలిసేదాకా... 

నిప్పులాంటి నిందల్ని...ఓర్చుకునేవాడే..! 

పరిస్థితుల కనుగుణంగా 

తన పద్ధతులను......మార్చుకునేవాడే..! 

కన్నుమూసేలోగా తన కన్నతల్లిదండ్రుల ఋణాన్ని కాసింతైన...తీర్చుకునేవాడే..!

నిజానికి జీవితంలో గొప్పవాడు..!

అట్టివాడే అందరికీ ఆదర్శప్రాయుడు..!

ఒక భోగి..!

ఒక యోగి..!

ఒక త్యాగి..!

ఒక మనీషీ..!

ఒక మహర్షి..!

ఒక మహాత్మ..!

ఒక స్ఫూర్తి ప్రదాత..!

ఒక నిజజీవిత నిర్మాత..!

ఒక జాతిమిచ్చే జననేత..!

ఒక సంఘ సంస్కర్త....!

ఒక సుఖజీవన సృష్టికర్త....!