పాల జీవితం… ముద్దు మురిపాల జీవితం…
గోమాత ఇచ్చే
పాలలో...
పెరుగు
పెరుగులో...
మజ్జిగ
మజ్జిగలో...
వెన్న
దాగివున్నా
పెరుగు ధరకన్న...
పాలధర మిన్న
మజ్జిగ ధరకన్న ...
పెరుగు వెన్న ధరమిన్న...
అందుకే
ఓ మనిషీ
ఉండాలి
నీ జీవితం
పాలలా...
స్వచ్చంగా...
మజ్జిగలా...
చిక్కగా...
పెరుగులా...
శక్తివంతంగా...
ఖరీదైన
వెన్నలా...కమ్మగా
పాలలా ఉంటే
నీ జీవితం...
అది పరిమళించే
పారిజాతం...



