నేటి...కన్నెపిల్లలే..! రేపటి కన్నతల్లులు..!!
కమ్మని కలలుగానే
నేటి.....కన్నెపిల్లలే
రేపటి...కన్నతల్లులు
నేటి....కొంటెకోడళ్లే
రేపు....ఇంటపెత్తనం
చెలాయించే అత్తలు
శ్రమించే
నేటి.....సేవకులే
రేపటి... యజమానులు
నేటి.....మట్టిలో విత్తనాలే
రేపటి...మర్రివృక్షాలు
నేటి.....అలిగే అల్లుళ్ళే
రేపటి...మాయదారి మామలు
చురుకైన
నేటి.....బాలలే
రేపటి...భావిభారత నిర్మాతలు
నేడు...సిగ్గుపడే మొగ్గలే
రేపు....నవ్వులు రువ్వే పువ్వులు
నేటి.....అమ్మానాన్నలే
రేపటి...అత్తామామలు అవ్వాతాతలు
నేడు....ఓర్పుతో సహించిన ఓటమే
రేపటి...ఉజ్వల
భవిష్యత్తుకు బంగారుబాట



