ఒక్కసారి…
ఓ మనిషీ..!
నీవు మరణించే ముందు...
కన్నుమూసే
కాటికెళ్ళేముందు...
ఒక్క క్షణం...
మదినిండా ప్రశాంతతను నింపుకో...
చేతులు రెండు జోడించి...
కళ్ళు రెండు మూసుకుని...
శిరస్సును వంచి...దైవాన్ని దర్శించి
నేటి
ఇంతటి
విలువైన...
విశిష్టమైన...
విలాసవంతమైన...
చిత్ర విచిత్రమైన...
పరమ పవిత్రమైన...
ఉన్నతమైన...ఉత్కృష్టమైన...
ఈ మానవ జన్మను
ప్రసాదించిన ఆ పరమాత్మ
పాదారవిందాలకు ప్రణమిల్లి...
ఒక్కక్షణం...మదిలో స్మరించు...
కృతజ్ఞతాస్తుతులు చెల్లించు...చాలు
నీ జన్మ ధన్యమే...నీకు దక్కుపుణ్యమే..



