Facebook Twitter
బండారం బట్టబయలు…

ఎన్నో ఏళ్ళు 

భక్తి శ్రద్ధలతో... 

క్రమ శిక్షణతో...

కఠోర శ్రమతో...

అకుంఠిత దీక్షతో...

నియమ నిష్టలతో...

వినయ విధేయతలతో... 

అహోరాత్రులు 

తపోసంపన్నులైన 

గురుదేవుల వద్ద 

అపారమైన...

అఖండమైన... 

అద్భుతమైన...

అపూర్వమైన... 

అద్వితీయమైన...

అనితరసాధ్యమైన...

విద్యలెన్నో నేర్చుకుని...

బృహత్ గ్రంథాలెన్నో పఠించి... 

సకల శాస్త్రాలను ఔపోసన పట్టి...

అనంతమైన విజ్ఞానం ఆర్జించిన 

ఓ "పండితుడు" తనకు తెలిసింది

అనంతమైన సంద్రంలోని 

ఒక "నీటిబిందువని"... భావిస్తే...!

తాను పట్టిన కుందేటికి 

మూడేకాళ్ళనే ఓ "మూర్ఖుడు" 

తనకు తెలిసింది ఆవగింజంతైనా 

కొండంత జ్ఞానమున్నట్టు 

కోతలు కోస్తాడు తానే జ్ఞానినని...

అందరూ అజ్ఞానులని...

అహంకారంతో విర్రవీగుతాడు

ఇది మానవ నైజం... 

అందుకే ఓ నరుడా..!

తెలుసుకో ఓ పచ్చినిజం ..! 

పులిచారలు 

వేసుకున్న నక్కబండారం... 

ఒక్కవర్షంతో...బట్టబయలని..!

కాకి కోకిల రంగు రూపం 

ఒక్కటైనా...ఒక్కకూతతో...

కాకి బండారం...బట్టబయలని..!

అందుకే ఓ నరుడా..! 

తెలుసుకో ఓ పచ్చినిజం ..!

కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదని..!

ఏమిలేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందని.!