Facebook Twitter
ఈ జన్మకు అర్థం పరమార్థం ఏమిటి..?

 

ముందులెయ్యాలి...

సుఖపడాలనుకుంటే...

పుష్టికరమైన              

ఆహారం పుచ్చుకోవాలి...

షష్టి పూర్తి 

చేసుకోవాలనుకుంటే...

ఎంతో కష్టపడి...

శ్రమపడి...భ్రమపడి...

ఆశపడి‌...ఆస్తులార్జించాక

కొంతైనా అనుభవించాలి... 

కొంత కుటుంబసభ్యులకు

దాచి ఉంచాలి...మిగిలింది 

ప్రేమతో పదిమందికి పంచాలి...

ఆ పరమాత్మ నుండి

పిలుపు అందేదాక...

కన్నుమూసి కాటికి చేరేదాక...

నిత్యం ఆ భగవన్నామస్మరణ చేస్తూ

నిరుపేదలకు నిస్వార్థంగా సేవచేయాలి

అన్నార్తులను అనాధలను ఆదుకోవాలి

అఖండ కీర్తిని ఆర్జించాలి...

అందరికి ఆదర్శంగా నిలవాలి...

మీ పేరు ప్రజల 

పెదవులపై నాట్యమాడాలి...

నిత్యం వారి 

నాలుకలపై ప్రతిధ్వనించాలి... 

వారి గుండెగుడిలో 

మీరు ఆరనిజ్యోతులై వెలగాలి...

అప్పుడే కదా ఈ 

మానవజన్మకు ఓ అర్థం ఓ పరమార్థం.