జీవితం...సంగీత సాగరం
ఓ మనిషీ
ఓ నిండునిజం
చెబుతా విను
ఆరు రుచుల
సమ్మేళనమే కదా ...
ఉగాది పచ్చడంటే...
ఆరు ఋతువుల
కలయికే కదా...
ఈ కనిపించక కదిలే కాలమంటే...
అరిషడ్వర్గాల
సమ్మేళితమే కదా అంతరంగమంటే...
అందుకే ఓ మనిషీ నీలో
రగిలే ఈర్ష్యా ద్వేషాలు
తక్షణమే దగ్ధమైన పోవాలి
తెలిసో తెలియకో నీవు చేసిన
తప్పులే నీకు గుణపాఠాలు నేర్పాలి...
నీ ఆవేదనలు ఆవిరై పోవాలి
నిన్ను భయబ్రాంతులకు
గురిచేసే చింతలు చీకాకులు
బాధలు భయాలు భస్మమౌపోవాలి...
అప్పుడు కదా
అనంతమైన అఖండమైన
ఆనందం ఆవిష్కృతమయ్యేది..
అప్పుడు కదా నీ జీవితం
సుఖజీవన సంగీత సాగరమయ్యేది ...
అప్పుడు కదా
నీ ఈ మానవజన్మ సార్థకమయ్యేది...
అప్పుడు కదా
నీవు చిరకాలం జీవించేది...
చీకటిలో చిరుదీపమయ్యేది...
చితికి చేరినా చిరంజీవివయ్యేది...
బూడిదైనా బుద్ధుడిగా అవతరించేది.



