Facebook Twitter
ఆ పాపమే ఒక శాపమై…

ఓ మనిషీ నీవు 

కష్టపడి నీకడుపు 

మాడ్చుకొని...      

అభాగ్యుల అనాధల

కడుపు నింపిననాడే

నీవు కరుణామయుడవు

 

నిజానికి 

కడుపు నింపడం కాదు 

గొప్ప మనసు నింపడమే 

కానీ ఓ మనిషీ 

కడుపులో 

కత్తులుంచుకొని 

కౌగిలించుకోరాదు..!

పరుల కడుపుకొట్టి 

 

అన్యాయంగా  

అక్రమంగా

దాదాగిరి చేసి 

దౌర్జన్యంగా 

జనాన్ని పీడించి

ధనాన్ని దోచుకోరాదు..!

స్విస్ బ్యాంకుల్లో దాచుకోరాదు..! 

రేపు 

ఆ పాపమే...

ఒక శాపమై 

ఒక...అనకొండలా 

నీ మెడకు 

చుట్టుకుంటోంది... 

ఒక...సునామీలా 

నిన్ను ముంచెత్తుతుంది

మెడమీద

"కత్తిలా" వ్రేలాడుతుంది

ఒక...పిశాచిలా

నిన్ను వెంటాడుతుంది

ఒక...పులిలా సింహంలా

నిన్ను వేటాడుతుంది...

ఒక...కాలసర్పమై 

నిన్ను నీ పిల్లల్ని కాటేస్తుంది... 

నిన్ను కాటికీడుస్తుంది

సర్వనాశనం చేస్తుంది...

నాడు మనశ్శాంతి లేకుండా

నీవు మరణిస్తావ్ తస్మాత్ జాగ్రత్త...