Facebook Twitter
ఆ...మూడు వరాలే..?

పరిచయం... 

ఒక విత్తనం..! 

స్నేహం... 

ఒక మొక్క..! 

బంధం... 

ఒక పచ్చని 

చెట్టు కావొచ్చు... 

మర్రివృక్షంగా మారొచ్చు 

ఆ పరమాత్మ కరుణిస్తే..! 

మోడువారిన 

చెట్టు కావొచ్చు 

ఆ విధి వికటిస్తే..!

ఓ విషపునవ్వు నవ్వితే..!

ముడిపడి పోతుంది 

ఎందుకో ఏమో...!

ఒక పరిచయం 

ఒక చూపుతో..! 

ఒక స్నేహం 

ఒక మాటతో..! 

ఒక బంధం 

ఒక తాళితో..! 

అది వివాహబంధమైతే... 

అది దైవ సంకల్పమైతే..! 

ఒక నమ్మకంతో...

అది వ్యాపారమైతే... 

వ్యవహారబంధమైతే..!

ఒక కన్నతల్లి 

పేగుతో...ప్రేమతో...

అది రక్తసంబంధమైతే...

అది అనురాగబంధమైతే..!

అది పరిచయమైనా... 

స్నేహమైనా...బంధమైనా...

పదికాలాలపాటు పదిలంగా 

పచ్చగా పటిష్టంగా నిలవాలంటే... 

మీలో ప్రేమతత్వం ప్రవహించాలి...

మంచితనం మానవత్వం పరిమళించాలి

మీ మనసులు...నిష్కల్మషంగా... 

స్వచ్చంగా...నిస్వార్థంగా ఉండాలి... 

మీలోని ఆగ్రహం నిగ్రహంగా మారాలి...

దైవానుగ్రహం మీపై కుంభవర్షమై కురవాలి