శాంతమూర్తినే నేను...శాడిస్ట్ కాను
కోపంతో
కళ్ళెర్ర జేస్తే
నా కళ్ళనుండి
కురుస్తాయి నిప్పురవ్వలు
అప్పుడు నా
శతృవుల కళ్ళనుండి
చిందుతాయి రక్తపుధారలు
ఐనా...
శాంతమూర్తినే..నేను శాడిస్ట్ ను కాను
నేనెవరి వెనుక
గోతులు త్రవ్వను
కానీ నాకు తోడుగా
నా నీడగా నమ్మకంగా ఉంటూ
నిత్యం నాకు నీతులు బోధిస్తూ
నా వెనుకే లోతుగా
గోతులు త్రవ్వేవార్ని
నా కవితల గొడ్డళ్ళతో నరికేస్తా...
ఐనా...
శాంతమూర్తినే నేను...శాడిస్ట్ ను కాను
నా ముందర
నవ్వుతూ ఎంతో
మంచిగా నటించే వారికి
మాయమాటల మాంత్రికులకు
నేడే నేను మరణశాసనం వ్రాసేస్తా...
ఐనా...
శాంతమూర్తినే నేను...శాడిస్ట్ ను కాను
నేనొక వీరున్నని...శూరున్నని...
ఇంద్రున్నని...శ్రీరామచంద్రున్నని...
పదిమందిలో నన్ను తెగపొగిడేస్తూ
నా వెనుక కుట్రలు కుతంత్రాలు పన్నే
కుక్కలమెళ్ళో చెప్పుల
దండలేసి ఊరంతా ఊరేగిస్తా...
ఐనా...
శాంతమూర్తినే నేను...శాడిస్ట్ ను కాను...



