నవదంపతులు...నవమాసాలు..?
మెరుపులు మెరిసినంత...
ఉరుములు ఉరిమినంత
పండవు పచ్చని పంటలు
చల్లగాలి తాకకనే...
మేఘాలు కురవకనే...
వానచినుకులు రాలకనే...
రైతు నుదుట స్వేదం చిందకనే..!
మూడుముళ్లు పడినంత...
కళ్యాణం జరిగినంత...
కడుపు పండదు
ఆలూమగలిద్దరూ కలవకనే..!
గుడ్లు పెట్టినంత...
పిల్లలు రావు కోడి పొదగకనే..!
ఏ పండుగా రాదు ఇల్లు అలకగనే..!
ఏ నేతకూ రాజకీయాల్లో
ఏ పదవి అధికారం దక్కదు
ఓట్లు రాకనే..!
అత్యధిక మెజారిటీతో
సీట్లు గెలవకనే..!
కాకమ్మ కబుర్లతో
కడుపు నిండదు...!
కష్టపడి చెమట
చుక్కలు చిందకనే..!
నవదంపతులైనా
ఏ బిడ్డకు జన్మనివ్వలేరు
నవమాసాలు నిండకనే..!
ఏ వ్యక్తికి
ముక్తి దొరకదు...
ముందుజన్మలో....
భగవంతునిపై భక్తిలేకనే..!



