Facebook Twitter
మూడు ముళ్ల బంధం ఒక ముళ్ళ కిరీటం

అది ఆకు పచ్చని
కాపురంలో ఆరని
చిచ్చును రేపవచ్చు...
కంటిలో కారం కొట్టవచ్చు...

కన్నీటి
వరదల్లో ముంచవచ్చు...
కళ్ళను కన్నీటి
సముద్రాలుగా మార్చవచ్చు...

గుండెల్లో గులాబి
ముళ్ళను గుచ్చవచ్చు...
గునపాలను దించవచ్చు...

పరువును...
గంగలో కలపవచ్చు
పాతాళంలో పాతిపెట్టవచ్చు...

అన్నింటికీ
కారణం ఒక్కటే కావొచ్చు
అదే..."అతి చనువు"...
తొండ ముదిరి
ఊసరవెల్లి ఐనట్టు...
"అతి చనువు"...
"అక్రమ సంబంధంగా" మారవచ్చు

దాంపత్యం...దగ్ధం కావొచ్చు
బంధాలు
బంధీ కావొచ్చు...బలికావొచ్చు...
మూడుముళ్ల బంధం
ఒక "ముళ్ళకిరీటం" కావొచ్చు...

అందుకే
లక్ష్మణ రేఖ...దాటరాదు
అవమానాల
అశోకవనాల...శోకించరాదు
అగ్ని ప్రవేశం....చేయరాదు
అడవుల్లో...పయణించరాదు
పర్ణశాలలో..శయనించరాదు
ఆ మహాసాధ్వి...సీతమ్మతల్లిలా...