- ఓ మిత్రులారా !
ఈ ఉషోదయం వేళ
మీకిదే నా శుభసందేశం ..!
మీ కళ్ళల్లో...
కన్నీళ్ళు ఇంకిపోవును గాక..!
మీ కళ్ళు ఆనంద
భాష్పాలను రాల్చును గాక..!
మీ గుండెల్లో
గులాబీల ముళ్ళు
గుచ్చుకోకుండును గాక..!
మీ గుండెలు గులాబీ
పరిమళాలతో నిండి పోవును గాక..!
మీకు కన్నీళ్లు రాని...
కలతలు కలహాలు లేని...
చింతలు...చీకాకులు
వేదనలు...ఆవేదనలు
అపార్ధాలు...
అవమానాలు...
అనుమానాలు...
అంతులేని మానసిక క్షోభలు...
దిగులు భయము బాధలు లేని...
మొండి రోగాలు రాని...రోజులను ఆ
భగవంతుడు మీకు ప్రసాదించును గాక..!
ప్రతి ఉషోదయం
మీకు ఒక శుభోదయమౌను గాక..!
మీకు రెండు చేతులు జోడించి
శుభోదయం చెబుతున్నా...!
సకల సంపదలు శుభాలు...
సునామీలై మిమ్మల్ని ముంచెత్తాలని...
ప్రేమ నిండిన మీ గుండెకు...
గుడ్ మార్నింగ్ చెబుతున్నా అది
ఆగిపోరాదని సాగిపోతూనే ఉండాలని...
ఓ మిత్రులారా !
ఈ ఉషోదయం వేళ
మీకిదే నా శుసందేశం ..!
మీ ముఖం...
చల్లనైన వెన్నెల
వెలుగులను విరజిమ్మును గాక..!
మీ పెదవులపై చిరునవ్వులు
నిత్యం శివతాండవం చేయును గాక..!
మీ కళ్ళల్లో...
కలల కాంతిరేఖలు విచ్చుకొనును గాక..!
మీ కనురెప్పల కౌగిలిలో
బంధీలైన కమ్మని కలలు చెరవీడి
విహంగాలై స్వేచ్ఛగా విహరించును గాక..!
మీరు కలనైనా
ఊహించని ఎన్నో
బంగారు అవకాశాలను...
అఖండమైన విజయాలను ఆ భగవంతుడు
మీకు ప్రసాదించును గాక..!
ప్రతి ఉషోదయం
మీకు ఒక శుభోదయమౌను గాక..!
మీకు రెండు చేతులు జోడించి
శుభోదయం చెబుతున్నా...!
సకల సంపదలు శుభాలు...
సునామీలై మిమ్మల్ని ముంచెత్తాలని...
ప్రేమ నిండిన మీ గుండెకు...
గుడ్ మార్నింగ్ చెబుతున్నా అది
ఆగిపోరాదని సాగిపోతూనే ఉండాలని...
ఓ మిత్రులారా !
ఈ ఉషోదయం వేళ
మీకిదే నా శుసందేశం ..!
మీ ఆశలన్నీ నెరవేరును గాక..!
మీ కోటి కోరికలు తీరును గాక..!
మీ సంకల్పాలన్నీ సిద్ధించును గాక..!
మీ కమ్మని కలలన్నీ పండును గాక..!
మీకు సుఖము శాంతి దక్కును గాక..!
దీర్ఘాయుష్షును...
అంతులేని ఆనందాన్ని...
సంపూర్ణమైన ఆరోగ్యాన్ని...
ప్రశాంతమైన జీవితాన్ని...
ప్రతిదినం...ప్రతిక్షణం...ఆ
పరమాత్మ మీకు ప్రసాదించును గాక..!
ప్రతి ఉషోదయం
మీకు ఒక శుభోదయమౌను గాక..!
మీకు రెండు చేతులు జోడించి
శుభోదయం చెబుతున్నా...!
సకల సంపదలు శుభాలు...
సునామీలై మిమ్మల్ని ముంచెత్తాలని...
ప్రేమ నిండిన మీ గుండెకు...
గుడ్ మార్నింగ్ చెబుతున్నా అది
ఆగిపోరాదని సాగిపోతూనే ఉండాలని...



