Facebook Twitter
ఆణిముత్యాలు...అక్షర సత్యాలు

ప్రతి చీకటి రాత్రి...
ఒక వేకువ వెలుగు
కిరణంతో అంతమౌతుంది...

ప్రతి వెచ్చని కన్నీటి ధార...
పెదవులపై మెరుపులా మెరిసే
ఒక చిరునవ్వుతో అంతమౌతుంది...

కమ్మని కలలు కన్న
ఒక అమ్మాయి మోసిన
ఆ తొమ్మిది నెలల భారం...
చివరిరోజు పంటి బిగువున
అనుభవించిన ఆ నరకయాతన... కెవ్వుమన్న ఒక్కకేకతో అంతమౌతుంది...
అంతులేని ఆనందాన్ని అనుభవిస్తుంది...
తల్లైతాను తన్మయత్వం చెందుతుంది..

అంటే దాని అర్థం
అగాధమౌ జలనిధిలో
ఆణిముత్యాలున్నట్లే...
శోకాల మరుగున దాగి
సకల సుఖశాంతులుంటాయన్న నాటి
కవి కమ్మని పలుకులు అక్షర సత్యాలు...