రాజీమార్గమే రాజబాట
నీవు
తెలిసో
తెలియకో
తప్పు చేసి తక్షణమే
క్షమించమని అడిగితే..!
నీకు నీవే గురువై
నీలోని లోపాలను
సకాలంలో గుర్తించి
సత్వరమే సరిదిద్దుకుంటే..!
మొండితనం
వలలో చిక్కుకోకుండా
ఆత్మన్యూనతా భావపు
ఊబిలోకి జారిపోకుండా
పంతాలు పట్టింపులకన్న
"రాజీమార్గమే"రాచబాటన్న
సత్యాన్ని తెలుసుకున్ననాడు..!
నీ మనసు...
ఒక ఆనందనిలయం..!
నీ హృదయం...
ప్రశాంతతకు ప్రతిరూపం..!
నీ జీవితం...
ఒక సువర్ణశోభితం...
అది ఎందరికో
ఆదర్శప్రాయం...స్పూర్తిదాయకం..!



