Facebook Twitter
ఉత్తరాలెందుకు దండగ...?

  • డార్లింగ్..!
    ఓ డార్లింగ్..!
    సదా నీ ఎదలో
    నన్ను నిదురించనియ్..!
    తేనెలూరే నీ బిగికౌగిలిలో
    నాకు తెలవారనీయ్...!అంటూ
    బంగారం నిన్న నీవూ
    ప్రేమతో నాకు సెల్లో పంపిన...

    "అందాల ఓ చిలుకా...
    అందుకో నా లేఖా
    నా మదిలోని కలలన్నీ
    ఇక చేరాలి నీదాకా"...
    అన్న ఆ మధుర గీతం
    వినీ వినీ...వినీ వినీ
    నా చెవులు రెండు
    ఆనందబాష్పాలు రాల్చాయి

    నా మది పొయ్యి మీది
    పాలలా పొంగి పోయింది...
    మనకిద్దరు కవలపిల్లలు
    అదీ ఇద్దరూ మగపిల్లలే
    పుట్టినంతగా ఆనందం
    కట్టలు తెంచుకుంది...

    2...
    నిన్న అర్థరాత్రి వేళ
    నీవే దిండనకున్నాను
    గట్టిగా హత్తుకున్నాను
    నిన్నే దుప్పటనుకున్నాను
    వెచ్చగా కప్పుకున్నాను
    ఇక్కడ ఏసీలో సైతం
    నాకు ఉక్క పోస్తోంది

    అక్కడ ఊటీలో డ్యూటీలో
    ఉన్న నీకు కూడా ఇలాగే
    ఉందా బంగారం అందుకే
    నిన్ను మురిపించాలని...
    మైమరిపించాలని...
    నిన్ను మత్తులో ముంచాలని...
    నీ అలసట తీర్చాలని...
    నీవు ఆదమరచి
    నా వెచ్చని కౌగిలిలో
    కరిగిపోతున్నట్టు
    కమ్మని కలలు కంటూ
    హాయిగా నిదురపోవాలని...
    కమ్మనైన కొన్ని ప్రణయగీతాలు
    పంపిస్తున్నా విను...నా బంగారం

    3...
    "కలువకు చంద్రుడు ఎంతో దూరం
  • కమలానికి సూర్యుడు మరీ దూరం
  • దూరమైన కొలది పెరుగును అనురాగం
    విరహంలోనే ఉన్నది అనుబంధం"...

    "ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాది
    ఎన్నటికీ మాయని మమతా నాదీ నీది
  • ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను
    ఒక్క క్షణం ఈ విరహం నేతాళలేను"...

    "నీ మది చల్లగా
    స్వామీ నిదురపో దేవుని నీడలో
    వేదన మరచిపో నీ మది చల్లగా...
    ఏ సిరులెందుకో
    ఏ సౌఖ్యములెందుకో
    ఆత్మశాంతి లేనిదే
    మనిషి బ్రతుకు నరకమౌను
    మనసు తనది కానిదే"...

    "ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా

నీకే భార్యనై ప్రతిజన్మనందు ఉంటా
నడిచే దైవమా నీ పాదధూళులే
పసుపు కుంకుమలు నాకు
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళారా చూడమ్మా"...

4...
ఇట్లు నిజానికి నీకు దూరంగా ఉన్నా
నీ కనురెప్పల్లో దాగిన నీ కలలరాణి...

ఓ బంగారం...
నీకో నిజం చెప్పనా...
ఉత్తరం వ్రాశా కానీ
పోస్ట్ చేయడం మరిచా...
ఎందుకో తెలుసా...
నిజానికది నీకు చేరి
నీ నుండి రిప్లైవచ్చేదాకా
నేనెట్టా ఆగేది...
ఈ విరహంతో నేనెట్టా వేగేది
చెప్పు...బంగారం...చెప్పు
సెల్లులుండగ...మెసేజ్లుండగ...
మనకు పండగ...మధ్యలో
ఉత్తరాలెందుకు శుద్ద దండగ...