ఆత్మీయ అభయహస్తం..!.
ముందు చూపున్న
కొందరి జీవితాలు
3 - పూవ్వులు...
6 - కాయలు.....
ముందు చూపులేని
కొందరి జీవితాలు
ముందు - నుయ్యి...
వెనుక - గొయ్యి...
నిజానికి
మన జీవితాలు
నీటి బుడగలు...
ప్రమాదాలు
పాము పడగలు...
ప్రమాదం
అకస్మాత్తుగా
నెత్తిపైపడే ఓ పిడుగు...
ముందు జాగ్రత్త
ఆ పిడుగును
అడ్డుకొనే ఓ గొడుగు...
కానీ కలలో సైతం
ఊహించని కష్టాల్లో
మనం పీకలదాకా
కూరుకు పోయినప్పుడు...
గట్టున పడ్డ
చేపల్లా మనం
గిలగిలా గిలగిలా
కొట్టుకుంటున్నప్పుడు...
"ముందు చూపు"...
మనల్ని కాపాడే
ఒక రక్షణ కవచం...
"ఆత్మ విశ్వాసం"...
మన కన్నీళ్ళను తుడిచే
ఒక ఆత్మీయ అభయహస్తం....



