ఇంట్లో ఎలుక దూరితే..?
గోళ్ళు పెరిగితే
కత్తిరించాల్సింది...
చేతివేళ్ళనా..?
కాదు కాదు...గోళ్ళను
జుట్టు పెరిగితే
తీసివేయాల్సింది
తలనా ...?
కాదు కాదు
తల వెంట్రుకల్ని
పచ్చని
కాపురంలో
మనస్పర్థల
కారుచిచ్చురగిలితే..?
తెంచుకోవలసింది
ఎన్నో ఏళ్ళుగా
పెంచుకున్న
బంధాలనా..?
అనుబంధాలనా..?
రక్తసంబంధాలనా..?
కాదు కాదు...
మనలోని
కోపతాపాలను...
పగాప్రతీకారాలను ...
అసూయాద్వేషాలను...
ఇంట్లో
ఎలుక దూరితే
నిప్పు పెట్టాల్సింది
ఇంటికా...? కాదు కాదు...
కలుగులో దాక్కున్న ఎలుకకు...



