బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
మకరందాలు..!
సుమగంధాలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
అగ్నిగుండాలు..!
అమృత భాండాలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
ప్రేమ బంధాలు..!
రక్త సంబంధాలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
ఉక్కిరిబిక్కిరి చేసే బంధాలు..!
ఉరివేసే ఊపిరి తీసే బంధాలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
ప్రాణత్యాగం చేసే నేస్తాలు.!
ఆదుకునే అభయ హస్తాలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
కళ్ళకు కనిపించని సంకెళ్ళు ..!
మదిమడుగున దాగిన మొసళ్ళు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
అందించును ఆనందాలు..!
చిందించును చితిమంటలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
ఎదిగే పచ్చని పైరులు..!
గలగలపారు సెలయేరులు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
భగవంతుడు ముడివేసే
మూడు ముళ్ల బంధాలు..!
విధి విషం చిమ్మి విడదీసే
వింతవింత వివాహ బంధాలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
నిన్నటి తీపిజ్ఞాపకాలు..!
రేపటి చేదు అనుభవాలు..!
బంధాలు బంధాలు
కొన్ని బంధాలు
పెంచుకోలేము..!
తెంచుకోలేము..!
ఉంచుకోలేము..!
కారణం పటిష్టమైన
ప్రేమ పునాదులుల్లేని
బలహీనమైన కల్తీ బంధాలన్నీ
సుందరమైన సమాధులే సుమా..



