అనంతలోకాలలో..! ఆనంద తీరాలలో..!
ఒంటరినైతే నేను ...
మౌనంగా ఒక మహామునిలా...
నాలో నేనే...
నాతో నేనే...మాట్లాడుకుంటా...
ఒక మిత్రబృందమైతే మనం...అన్నీ
అంబరాన్ని తాకే సంతోష సంబరాలే
ఒంటరినైతే నేను...
నాలో నేనే...నవ్వుకుంటాను...
ఊబిలో కూరుకున్న ఒక ఉన్మాదిలా...
ఒక మిత్రబృందమైతే మనం...
చిత్రవిచిత్రమైన చిలిపి చేష్టలే...
విరగబడి నవ్వులే...వికటాట్టహాసాలే... కడుపుబ్బ జోకులే...కేకలే...కేరింతలే...
నవ్వుల పువ్వులు...
రువ్వుకోవడాలే...
ముసిముసి నవ్వుల
ఆణిముత్యాలు ఏరుకోవడాలే...
ఆనందడోలికల్లో మునిగి తేలడాలే...
ఔను అదే...ఔతుంది
స్నేహబంధాల...
సుమగంధాల...
ఆత్మీయ అనుబంధాల...
అనంతలోకాల...ఆనందతీరాల...
విశాల వినోద వినువీధుల్లో
విహంగాల విహారానికి...
పెనవేసుకున్న ప్రేమపాశానికి...
విశ్వమానవత వికాసానికి ఓ ప్రతిరూపం



