Facebook Twitter
అర్ధాంగి అదృష్టం

కట్టుకున్న మొగుడు
కరుణామయుడైతే...
కలికి బ్రతుకు
కళకళలాడుతుంది...
పది కాలాలపాటు - పచ్చగ
పది మంది ఎంతో - మెచ్చగ

కాని
కట్టుకున్న భర్త
కఠినాత్ముడైతే...
కలికిక మిగిలేది కన్నీరె...
కారణం
కాపురమెప్పుడూ
కలతలతో...కలహాలతో
వేడెక్కి వుంటుంది  -  వెచ్చగ
ఒకరితత్వం ఒకరికి - నచ్చక