మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
అందమైన...
సుందరమైన...
ప్రతిష్టాత్మకమైన...
అతిపురాతనమైన...
ప్రాచీన కట్టడాలను
మళ్ళీ మళ్ళీ నిర్మించ ఎవరితరం..?
ఇదీ అంతే
ఇది ఒక వింతే
ఆత్మీయ బంధాలైనా...
ఆర్థిక సంబంధాలైనా...
నిర్మించడానికి పట్టు ఎన్నోఏళ్ళు నిర్మూలించడానికి చాలు ఒక్కక్షణం
అందుకే బంధాలను
తుంచకు...పెంచుకో
విషకౌగిలిలో...బంధించకు
విషాదంలో.....మునిగిపోకు
సత్సంబంధాలను...సమాధి చేయకు
వాటికి పటిష్ఠమైన...పునాదులు వెయ్
కానీ కొన్ని బంధాలు
పచ్చని ప్రేమ పందిళ్ళు...
కొన్ని బంధాలు
కళ్ళకు కనిపించని
సమస్యల ఇనుప సంకెళ్లు...
అందుకే మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
మరువకు మరువకు...
ఈ బంధాలను...
భవబంధాలను...
అనుబంధాలను...
ముడి వేసేది...
విడదీసేది...
పెంచేది...
తృటిలో తృంచేది...
కన్నీటి కడలిలో ముంచేది...
అఖండమైన...ప్రచండమైన
ఒక అతీంద్రియ...అదృశ్యశక్తియని...



