ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
మళ్ళీ మరుజన్మంటూ ఉంటే..?
ఏమిటీ నీ కొత్త కోరిక..?
అడవిలో ఒక పక్షిలా పుట్టాలనా..?
లేక కారడవిగానే జన్మించాలనా..?
లేక అడవిలో ఒక పళ్ళచెట్టులా...
ఆ చెట్టు మీది పచ్చని ఆకులా...
ఆ చెట్టుకు కాసేకాయలా పుట్టాలనా..?
కొమ్మలా రెమ్మలా ఎదగాలనా..?
లేదా చెట్టుకు కనిపించని
ఒక వేరుగా పుట్టాలనా...?
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
ఏమిటీ నీ కొత్త కోరిక..?
సముద్రంలో ఒక చేపలా పుట్టాలనా..?
లేక లోతైన సంద్రంగానే జన్మించాలనా..?
కడలిలో ఒక ఓడవై..?
ఒక తిమింగలమై తిరగాలనా..?
లేదా అగాధమౌ ఆ జలనిధిలో
ఒక ఆణిముత్యమై అవతరించాలనా..?
సముద్రంలోని ఒక నీటిబింధువై...
ఎగిసెగిసిపడే ఒక అలగా పుట్టాలనా..?
ఒక సముద్రతీరమై..? లేక ఆ తీరంలోని
ఒక ఇసుక రేణువై జన్మించాలనా..?
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
ఏమిటీ నీ కొత్త కల..? నీ కొత్త కోరిక..?
నీ ఈ కలను ఈ కోరికను తీర్చేదెవరు..?
ఇంకెవరు పైనున్న ఆ పరమాత్మయే కదా...



