Facebook Twitter
అందరికీ శుభశుభోదయం

చెప్పుకుందాం...
చెప్పుకుందాం...అందరికీ
శుభోదయం..."శుభ" శుభోదయం
"శుభోదయం" అనగా
ఒక సుందరమైన సూర్యోదయాన
అందరికీ రోజంతా"శుభాలు"జరగాలని
శుభాకాంక్షలు చెప్పుకోవడం...ఇదిగో ఇలా

పొడిచే‌...ప్రతి పొద్దు...
నుదుటి కుంకుమలా
అందరినీ మురిపించాలని...

నడిచే...ప్రతి నిమిషం...
నవ్వే నక్షత్రమై అందరి
జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని...

గడిచే...ప్రతి గంట...
గంగానది నిర్మలత్వాన్ని
అందరి గుండెల్లో నింపాలని...
కన్నకలల్ని కంచికి చేర్చాలని...
ఆశల్ని అమృతంలో ముంచాలని...

ప్రతిరోజు...
రోజాలా విరబూయాలని...
ప్రతి వారం...
పచ్చని హరితహారం కావాలని...
ప్రతినెల...
కరగని కమ్మని కలగా మిగలాలని...

అందరికీ ఆ పరమాత్మ
సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలనందించాలని...
చెప్పుకుందాం...చెప్పుకుందాం...
అందరికీ శుభోదయం‌...శుభశుభోదయం