ఒంట్లోబాగులేక
అనారోగ్యంతో
అనేక అవస్థలు పడి
ఎన్ని మందులు వాడినా
ఎన్నిఆసుత్రులు తిరిగినా
ఎంతోమంది డాక్టర్లను కలిసినా
ఎన్నో ఏళ్ళుగా తగ్గని
ఒక మొండి వ్యాధితో పోరాడి పోరాడి
ఎన్నో రోజులు మంచంలో వుండి
ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి
కన్ను మూసిన ఒక వ్యక్తి
ఆ వ్యాధి నయం కాకుండా
తిరిగి జన్మించడం సాధ్యమా ?
చనిపోయిన తర్వాత
ఆ వ్యక్తికున్న ఆవ్యాధిని
నయం చేసే డాక్టరెవరు ?
అసలు వ్యాధి
నయంచేయడానికి శరీరమేది ?
కన్నుమూయగానే కాటికెళ్ళగానే
కాలి బూడిదైపోయిన లేదా
సమాధి చేయబడి మట్టిలో మట్టై
ఒట్టి అస్థికలుగా మారిన మనిషి
తిరిగి జన్మించడం ఎలా సాధ్యం ?
మనిషి చనిపోగానే శవంగా మారగానే
ఇక చూసేది లేదు, పిలిస్తే పలికేది లేదు
చెప్పింది వినేది లేదు లేచి నడిచేది లేదు
మరి ప్రాణంపోసి తిరిగి
ఆ కట్టెను కదిలించేదెవరు?
మరుజన్మంటూ వుంటే
మరోజీవిగా జన్మించాలే
తప్పతిరిగి మనిషిగా
జన్మించడం మాత్రం అసంభవం
అంత్యదినాలలో సమాధులే తెరవబడి చనిపోయిన విశ్వాసులంతా బ్రతికితే వారు సజీవులతో కలిసి ఎలా జీవిస్తారు ఇది ఒక తీరని ధర్మసందేహం?
నిజానికి స్వర్గ నరకాలెక్కడున్నాయి ? అసలు పరలోక రాజ్యమెక్కడుంది?
రేపు మారుమనస్సు పొందని పాపులేమైపోతారు? మరో ధర్మసందేహం!



