Facebook Twitter
అమృత హస్తాలు

నీవు...
ఎప్పుడైనా ఏదైనా
ఘనవిజయం సాధిస్తే...
శబాష్ అంటూ
నీ భుజం తట్టే...
పట్టరాని ఆనందంతో...
పరమానందంతో...
చప్పట్లు కొట్టే...
ఆ స్నేహహస్తాలకన్న...

నీవు...
పెను విషాదంలో
మునిగి వున్నప్పుడు...
నీవు నిరాశ నిస్రృహలతో
కృంగి పోతున్నప్పుడు...
నీవు అంతులేని వేదనతో
కుమిలి పోతున్నప్పుడు...

నీవు...
కష్టాల్లో వున్నప్పుడు...
కన్నీరు కారుస్తున్నప్ఫుడు...
ఆ కన్నీటి చుక్కలను
తుడిచి నిన్నోదార్చి...
నీకు నేనున్నాననే
ఒక భరోసా నిచ్చే...
కొండంత ధైర్యాన్నిచ్చే...
వెయ్యేనుగల బలాన్నిచ్చే...
ఆ అమృత హస్తాలేమిన్న...