Facebook Twitter
కారుమబ్బులే కదా

ఎండే కడుపులతో...
మండే గుండెలతో...
మండుటెండల్లో...

కొండల మీద
కండలు కరిగేలా
బండలు మోస్తు
బ్రద్దలుచేస్తూ బ్రతికే...

నిరుపేదలకు
నీడనిచ్చేదెవరు ?
అండగా వుండేదెవరు ?
ఆదరించేదెవరు ?
చేరదీసేదెవరు ?
సేదదీర్చేదెవరు ?

అలా అలా ఆ ఆకాశంలో
కాసేపు చల్లనిగాలికి
కదిలే.... కదిలి...కరిగే
కరిగి...కురిసే ఆ నల్లని
చల్లని కారుమబ్బులే కదా.