నటుడు అంటే నటసార్వభౌమడంటే
ఒక వ్యక్తి...
గొప్ప ఉపన్యాసకుడంటే..?
ఎన్నో సభల్లో సమావేశాల్లో
వివేకానందుడిలా శ్రోతలను
ఉర్రూతలూగించేలా చైతన్య
పూరిత ఉపన్యాసాలు చేసుండాలి..!
ఒక వ్యక్తి...
కోటీశ్వరుడంటే..?
ముఖేష్అంబానిలా బిల్ గేట్స్ లా
ఎన్నో కోట్లుకోట్లు ఆర్జించి ఉండాలి..!
ఒక వ్యక్తి...
గొప్ప మానవతావాదంటే..?
మానవీయ విలువలతో
ఎన్నో సత్కార్యాలను చేసి ఉండాలి..!
ఒక నటుడు...
నటసార్వభౌముడంటే..?
ఎన్నో చిత్రాలలో తన అద్వితీయ
నటనతో ప్రేక్షకులనలరించి ఉండాలి..!



