Facebook Twitter
తల్లిదండ్రులు జాగ్రత్త

హాస్టల్ విద్యార్థులు
జైల్లో కుక్కిన ఖైదీలు...
పంజరంలో బంధించిన పక్షులు...
అంటున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు...



మంచిమార్కులు రాకున్ననేమి..?
"స్టేట్ ర్యాంకులు" రావాలని...
ఐఐటీలలో "సీట్లు" రావాలని...
కార్పోరేట్ కాలేజీలలో చదవాలని...
సాప్ట్వేర్ ఇంజనీర్లై విదేశాలలో
లక్షలు...కోట్లు...ఆర్జించాలని...

ఓ కన్నతల్లీదండ్రులారా..!
మీరు "పగటి కలలు" కనకండి..!
మీ పిల్లలకనే "కమ్మని" కలలేమిటో...?

కాసుల మధ్య...
కార్పోరేట్ కాలేజీల
ర్యాంకుల రేసుల మధ్య...
నలిగిపోయే మీ పిల్లల
రేపటి బంగారు భవిష్యత్ ఏమిటో...?

ఖరీదైన కార్పొరేట్ కాలేజీలు
ముక్కుపిండి వసూలు చేసిన ఆ
లక్షల ఫీజులు గంగలో విసిరినట్లేనా..?

అక్కడ పిల్లలు విద్యనే అభ్యసిస్తున్నారో...
మానసిక క్షోభను ఆందోళనను ఒత్తిడిని
"ప్రత్యక్ష నరకాన్ని" అనుభవిస్తున్నారో...
అడకత్తెరలో పోకచెక్కలై అల్లాడుతున్నారో...

కార్పోరేట్ వారు మీ కళ్ళకు
కట్టిన "గంతలు" విప్పి చూడండి..!
"నిఘానేత్రాలతో‌ "...పరిశీలించండి..!
"నిప్పులాంటి నిజాలను" తెలుసుకోండి..!

అక్కడ పిల్లలకు నేర్పేది"చదువే"కాదు
చదువు పేర జరిగేది "చీకటి వ్యాపారం"
మీ పిల్లలు వారి చేతుల్లో "కీలుబొమ్మలు"
వారికి ర్యాంకులు ఆర్జించే "రేసుగుర్రాలు"
తల్లిదండ్రులూ జాగ్రత్త..!తస్మాత్ జాగ్రత్త..!