ఎవరైనా మనల్ని
గౌరవిస్తున్నారంటే..!
అది మనల్ని కాదు
మన అధికారాన్ని..!!
ఎవరైనా మనల్ని
పొగుడుతున్నారంటే..!
అద మనల్ని కాదు
మనం సాధించిన
ఘన విజయాలను..!!
ఎవరైనా మనల్ని
విమర్శిస్తున్నారంటే..!
అది మనల్ని కాదు
మన వైఫల్యాల్ని..!
మనం గుర్తించని
మన లోపాల్ని..!!
ఎవరైనా మనకు
నమస్కారం
చేస్తున్నారంటే..!
అది మనకు కాదు
మనం కూర్చున్న మన కుర్చీకి..!!
ఎవరైనా మనల్ని
ప్రేమిస్తున్నారంటే..?
అది మనల్ని కాదు
మనలోని మంచితనాన్ని..!
మనలో దాగిన మానవత్వాన్ని..!!
ఎవరైనా మనల్ని
సన్మానిస్తున్నారంటే..!
అది మనల్ని కాదు మనం
చేసిన సాహస క్రుత్యాలను..!!
మనం సాధించిన ఘనవిజయాలను..!!
ఎవరైనా మనల్ని
పూజిస్తున్నారంటే..!
అది మనల్ని కాదు
మనలోని దానగుణాన్ని..!!
మనలో దాగిఉన్న ఆ దైవాన్ని..!!
అందుకే మంచితనం మానవత్వం
దాతృత్వం దైవత్వం నిండిన మనిషి
నరుడా కాదు కాదు నారాయణుడే..!



