మనం పుట్టగానే...
కెవ్వుమని కేక పెట్టగానే...
ఈ లోకంలో అడుగు పెట్టగానే...
..."తల్లితండ్రులు"...
తన్మయత్వం చెందాలి...
పట్టరాని ఆనందంతో
పరవశించిపోవాలి...
తొలిసారి మన మోము
తిలకించి పులకించి పోవాలి...
ముద్దు మురిపాలు
పంచి మురిసిపోవాలి...
మన సద్బుద్ధిని విజ్ఞానాన్ని
వినయ విధేయతలను గుర్తించి
..."గురుతుల్యులు"...
దీర్ఘాయుష్మభవా అంటూ దీవించాలి...
సమస్యలకు
సత్వరం స్పందించే...
అభయహస్తం అందించే...
మన సత్ప్రవర్తనను చూసి
..."ఇరుగుపొరుగువారు"...
మనమంటే ఇష్టపడాలి గౌరవించాలి...
పగా ప్రతీకారలతో రగిలిపోతూ
మనపై కత్తులు దూసిన మన
..."బద్దశత్రువులే"...
మనం కన్నుమూస్తే కాటికి రావాలి...
కన్నీరు మున్నీరుగా విలపించాలి...
అలా
ఆదర్శపాయంగా
జీవించాలి మనిషన్న వాడు...కానీ
అట్టివాడు కనిపించకున్నాడెక్కడా...
వేయి కాగడాలు పట్టి ఎంత వెతికినా..!



