ప్రళయ గర్జనలేల
ఓ ప్రణయ దేవత..?
విలయ తాండవమేల
ఓ మలయ మారుతమా..?
నిన్న చిలిపివలపులు
చిలికిన నీ హృదయం నేడు
విషవలయమాయె నెందులకో..?
నిన్న నాకై నిముష నిముషం
తపించిన నీ మది నేడు
నిరాశా నిలయమాయె నెందులకో..?
నిన్న నా కళ్ళలో
కలల కనకవర్షం కురిపించి
నేడు ఆ కళ్ళలోనె ముళ్ళెన్నో విరిచి
మురిసిపోతున్నావా ఓ ముగ్దమోహిని..!
ఓ సీ నా ప్రేయసీ..!
నిన్న సిగ్గులుమొగ్గలు తొడిగె
నీ నునులేత ే మీద
ముద్దుల మ్రుగ్గులు వేసే ణణ్డఙ
తరుణాన...ఏదో తన్మయత్వాన
నా ఎదపై ఒదిగి
మత్తుగా మూల్గి
నా కళ్ళలోకి చూస్తూ ..?
ఓ ప్రియతమా..!
నీ పొందు మరుజన్మకైనా
మరువలేని "మత్తుమందని"...
నా కన్యత్వాన్ని కానుకగా చేసి
పగలురేయి నీకందిస్తా...
పసందైనవిందని" చిలకలా
పలకలేదా...కమ్మగా కమకమ్మగా?
ఇంకా ఏలనే ? ఈ ప్రళయ గర్జనలు
ఓ ప్రణయదేవత..! ఇకనైనా ఆపవా..? ఈ
విలయతాండవం ఓ మలయమారుతమా!



