Facebook Twitter
ఎవరికి ఎవరికి

వైద్యుడెవరికి ?
.....
రోగులకే‌

గెలుపెవరికి ?
.....
శ్రమజీవులకే

వెలుగెవరికి ?
.....
చీకటిలో ఉన్నవారికే

ఆపరేషన్ ఎవరికి ?
.....
రోగం ముదిరినవారికే

ఉపాయమెవరికి ?
.....
ఊబిలోకి జారినవారికే

ఆపన్నహస్తమెవరికి ?
.....
విధిపంజా విసిరిన వారికే

విముక్తి ఎవరికి ?
.....
బానిసత్వంలో మునిగినవారికే

కల్యాణం ఎవరికి ?
.....
వయసొచ్చి కలలుకనే కన్నెపిల్లకే 

స్వాంతన ఎవరికి ?
.....
ఆత్మహత్యా ఆలోచన ఉన్నవారికే

కర్రెందుకు చేతిలో  ?
కాటేసె పామును ఖతంచేయడానికే

నీళ్ళు నీడ ఎవరికి ?
.....
ఎడారిలో ఎండలో పయణించే వారికే

పారాచూట్ ఎవరికి ?
.....
విమాన ప్రమాదంలో చిక్కుకున్నవారికే

శిలువ శిక్ష ఎవరికి ?
.....
పాపుల భారాన్ని మోసేటి ఆప్రభువులకే

జైలు శిక్ష ఎవరికి ?
....
జలగల్లా పీల్చే లంచగొండి ఉద్యోగులకే
....కన్నె పిల్లలను కాటువేసే కామాంధులకే
....దోపిడీలు హత్యలుచేసి
....దొరల్లాతిరిగే దొంగలకే