Facebook Twitter
పాఠాలు గుణపాఠాలు

మన "ప్రాణమిత్రులు"
మన "బద్ద శత్రువులు"
ఇద్దరు మనకు గురువులే...
ఒకరు "పాఠాలు" నేర్పుతారు
మరొకరు "గుణపాఠాలు" నేర్పుతారు

ప్రకృతిలోని
పంచభూతాలు...
మనకు కనిపించీ
కనిపించని గురువులే...
కానీ "ప్రకృతిని" ప్రేమిస్తే అది
మనకు "పాఠాలు" నేర్పుతుంది
"పంచభూతాలను" వంచిస్తే అవి
మనకు "గుణపాఠాలు" నేర్పుతాయి

కానీ ఓ మనిషీ..!
ఒక నగ్నసత్యాన్ని
గుర్తుంచుకో నీచుట్టూ
"గురువులు" ఉంటారు
"గుంటనక్కలు" ఉంటాయి
గురువులు నేర్పేది "పాఠాలు"
గుంటనక్కలు నేర్పేది "గుణపాఠాలు"

అందుకే ఓ మనిషీ..!
గురువులకు నామం పెట్టకు...
గుడిని గుడిలోని లింగాన్ని దిగమ్రింగకు...