ఆశబోతు అల్లుళ్ళు
అదనంగా...
కట్నకానుకలు కావాలని...
ఆశబోతు అల్లుళ్ళు వ్రాసే...
"ప్రతి కవ్వింపు
ఉత్తరమొక.."కత్తి పోటు"..!
అది తప్పక
తెస్తుంది...."గుండెపోటు"..!
కాని...
కలహాల
కాపురాన్ని ఈదలేక
తన కన్న కూతురు వ్రాసే...
ప్రతి "కన్నీటి
ఉత్తరమొక...గుండె కోత"..!
అది గుర్తుకు తెస్తుంది.
"విధి వ్రాసిన
'వింత.......నుదిటి వ్రాత"..!
ఆర్థికంగా చితికి...
అప్పుల్లో బ్రతికె...
ప్రతి ఆడపిల్లల తండ్రి
వేయి గుడిమెట్లు ఎక్కి
వేడుకునేది ఒక్కటే..!
కోటి దేవుళ్ళకు మ్రొక్కి
కోరుకునేది ఒక్కటే..!
ఆశబోతు అల్లుళ్ళ
"జాతకాలు" మార్చమని..!
ఆడపిల్లల తండ్రులుగ
వారికి "పునర్జన్మ" నివ్వమని..!



