అందం
అనగానే
ఆకాశంలో
ఒక చందమామ...
బాపు గీసిన ఒక బొమ్మ...
రవి వర్మ వేసిన ఒక చిత్రం...
గుర్తుకోస్తాయ్ గుబులు రేపుతాయ్
ఇదిగో అందమైన
ఈ స్త్రీమూర్తిని చూడండి
అందాలు ఆరబోయడం లేదు
ఐనా కనురెప్పలనార్పకుండా
అలాగే అలాగే చూడాలనిపిస్తుంది...
అందమంటే ఇదేనేమో అనిపిస్తుంది...
తాకితే కింది పోయేలా
నిగనిగలాడే నిర్మలమైన
స్త్రీరూపాన్ని అంత అందంగా
సృష్టించిన....ఆ బ్రహ్మనా..?
ఎవరిని పొగడాలి..? ఏమని పొగడాలి..?
కష్టపడి కని తమ
రక్త కణాల రంగునిచ్చి అందంగా
పోతపోసి ఒక సుందరరూపాన్ని
అందించి ఆ అమ్మా నాన్నలనా..?
ఎవరిని పొగడాలి..? ఏమని పొగడాలి..?
తనను తాను అందంగా
ఆకర్షణీయంగా అలంకరించుకొని
ఎన్ని జన్మల పుణ్యఫలమో...అది
ఏ దేవివరమో తనకే దక్కిన అందంతో
చిరునవ్వులు చిందించే ఆస్త్రీ మూర్తినా..?
ఎవరిని పొగడాలి..? ఏమని పొగడాలి..?
తన ఖరీదైన కెమెరాతో ఎంతో నైపుణ్యంగా ఆమె అందచందాలను
అధ్భుతంగా తన కెమెరాలో బంధించి మనకు అందించిన ఆ ఫోటోగ్రాఫర్ నా..?
ఎవరిని పొగడాలి..?ఏమని పొగడాలి..?
కన్నుమూసి
కలవరించడం తప్ప
కమ్మని కలగా మారి కళ్ళలో
తిష్టవేసి మదిని కలవర పెట్టడం తప్ప
అలా అలా తిలకించి తిలకించి
పులకించి పులకించిపోవడం తప్ప ఆమె
అందాన్ని కళ్ళారా ఆస్వాదించడం తప్ప.



