Facebook Twitter
అమ్మానాన్నల కళ్ళల్లో ఆనంద భాష్పాలు

కన్నతల్లిదండ్రుల కళ్ళల్లో
ఆనందభాష్పాలు పొంగేదెప్పుడు ? 
పుత్రుడు పుట్టినప్పుడు కాదు
ఆ పుత్రున్ని పదిమంది పొగిడిప్పుడు...

కానీ తల్లిదండ్రుల
మాటల్ని...లెక్కచేయనివాడు
గురువుల్ని...వెక్కిరించేవాడు

పరమాత్మకు...మ్రొక్కనివాడు

అందరికీ బద్ధశత్రువైన బద్ధకం
తనకు ఆత్మబంధువనేవాడు...
ఎప్పుడూ ఊహల్లో ఊరేగేవాడు...

జీవితంలో
ఒక దీర్ఘకాలిక
లక్ష్యమంటూ లేనివాడు...
దేనికి ముందుకు రానివాడు...
తానెందుకు పుట్టాడో
క్షణం కూడా ఆలోచించనివాడు...
వెలుగుకన్నా చీకటినే ప్రేమించేవాడు...
సోమరితనానికి స్వాగతం పలికేవాడు...

ఎంత నీరు పోసినా ఎదగని
"పూలమొక్కతో "సమానమంటారు
రెక్కలున్నా
"ఎగరలేని పక్షితో" సమానమంటారు
వాడి బ్రతుకెప్పుడూ
"నిప్పుల కుంపటే...అప్పుల దుప్పటే "

అందుకే అంటారు అనుభవజ్ఞులు
"వాడని కిటికీలు"
పెట్టీ ప్రయోజనం లేదని...
"ఉపయోగపడని కొడుకులు"
పుట్టీ ప్రయోజనం లేదని...