ప్రియా...ఓ నా ప్రియా...
ఎందుకు..? ఎందుకు..?
ఎందుకిలా మారిపోయావు..?
వింతగా విచిత్రంగా వికృతంగా..?
ఊసరవెల్లిలా...ఊహకందనంతగా
మనసులో కోపంతో కసితో
ఎందుకు నాపై విషం చిమ్మేవు..?
పరుల చేతుల్లో మరబొమ్మగా
మారిపోయావెందుకన్నందుకా..?
చెరగని మాయని
మచ్చను మీదకెందుకు
తెచ్చుకున్నావన్నందుకా..?
పచ్చని కాపురంలో...ఆరని
చిచ్చెందుకు రేపుకున్నావన్నందుకా..?
ఎందుకు..?ఎందుకు..?ఎందుకు..?
కానీ ఒక్కసారి నీ అంతరంగపు
అద్దంలోకి తొంగిచూడు లోతుగా
వింతగా వికృతంగా...నీవెంతగా
మారిపోయావో నీకే అర్థమౌతుంది
నీ విచిత్రమైన ప్రవర్తన
గురించి నీకు చింత లేదు
ఇలా వింతగా...మారినందుకు...
కానీ నిజానికి నీలో ఈ మార్పు
ఎవరో ఏదో అన్నందుకు కాదు...
నీ మనసులో ఏదో
ఒక "దుష్టపిశాచి"...దూరినందుకు...
అందుకే నీలో పశ్చాత్తదీపం వెలిగించుకో
ఆ దుష్టపిశాచిని దూరంగా తొలిగించుకో



