Facebook Twitter
తొలకరి జల్లుల తొలిరాత్రి...!

శృంగార యాత్రలో...
సరస సంగీతానికి స్వాగతం
పలికిన ఆ శోభనం రాత్రి ...
పరిమళించే ఆ పడక గదిలో...
పకపకలాడుతూ పరవశించిపోతూ... రకరకాల కోరికలతో రగిలిపోతూ...

ముద్దుల యుద్ధంలో మునిగితేలుతూ యిద్దరు...నిదురరాని ఆ యిద్దరు
సంసారంలోని సరిగమలను... శృంగారంలోని శృతిలయలనాలపిస్తూ

ఇలాగే ఇలాగే....ప్రతిక్షణం ప్రతిదినం మధురంగా.......అతి మధురంగా...
ఇలాగే ఇలాగే....ప్రతిపగలు ప్రతిరాత్రి గాఢంగా...........అతి గాఢంగా...

ఆ రతీమన్మధులకే మతిపోయేలా...
బ్రతికినంత కాలం ఒకరినొకరు... పెనవేసుకుపోయి బ్రతకాలన్నదే....

నేడా గదిలో
మనస్పూర్తిగా...
మంగళసూత్రం...సాక్షిగా...
సర్వం యిచ్చి.....పుచ్చుకునే
ఆ క్రొత్తదంపతుల..."పిచ్చికోరిక".