Facebook Twitter
అందమైన వీధిదీపాలు..!

మన స్నేహితులు...
మన బంధువులు...
మన శ్రేయోభిలాషులు...
వెలిగే అందమైన వీధిదీపాలే...

మన మార్గాన్ని మార్చలేరు...
మన దూరాన్ని తగ్గించలేరు...
కాని దారినిండా కమ్ముకున్న...
చిమ్మచీకటిని తొలిగించగలరు...
వెన్నెల వెలుగుల్ని నింపగలరు...
దూరాన్ని పెనుభారం కాకుండా...
అంధకారం లేకుండా చేయగలరు...

అందుకే మీ బంధువులను...
మీ ప్రాణమిత్రులను...
మీ శ్రేయోభిలాషులను...
ఉంచకండి...దూరంగా...
మార్చుకోకండి...మీ బ్రతుకును...
ఘోరంగా...భారంగా...అంధకారంగా...