తగ్గేదెలే...
మేం అరకొర
ఆదాయం గల
పెన్షన్ జీవులం...
అందరి మీద
ఆధారపడేవాళ్ళం...
అల్పసంతోషులం...
ఆశలు చావని వాళ్ళం...
కోర్కెలు తీరని వాళ్ళం...
కలలు పండని వాళ్ళం...
తలలు నెరసిన వాళ్ళం...
ఎండుటాకులం...
తెగిన గాలిపటాలం...
రెక్కలు విరిగిన పక్షులం...
కానీ ఏమిఉన్నా లేకున్నా
ఆత్మగౌరవం ఆత్మాభిమానం
మాకున్న తరగని ఆస్తులే...
పెత్తనం...పెద్దరికం...ఆధిపత్యం
విషయంలో మాత్రం మేం తగ్గేదేలే...



