బెండకాయ ముదిరిందని
బెంగపడి లాభమేమి? చెప్పండి
ముదరక ముందే
వుండాలి కదా ముందు జాగ్రత్త
వయసు ముదరక
ముందే వివాహం జరగాలి
చీకటి పడక ముందే
దీపం వెలిగించుకోవాలి
రేట్లు పెరగక ముందే
ప్లాట్లు కొనుక్కోవాలి
ప్రీమియం పెంచక ముందే
పాలసీ తీసుకోవాలి
ఇంటి పెద్ద వుండగానే
ఇన్సూరెన్స్ చేసుకోవాలి
ఇట్టి ముందుచూపు
లేనివారంతా అంధులే...
ఈ మంచిమాట విన్న
చాలు మీజీవితాన విందులే...
ముఖాముఖి చర్చలు
మనస్పర్థలకు మందులే...
లేకున్న చింతలే చిక్కులే...
చిరుచీకట్లో చిందులే...
సమస్యల చలిమంటలే...
ముందుజాగ్రత్త
అన్నది మూర్ఖత్వం కాదు
శత్రువును కౌగిలించుకోవడం
పిరికితనం కాదు
అది ముందరికాళ్ళకు బంధం
పొదుపు మదుపన్నది
పిసనారితనం కాదు అది
బంగారు భవిష్యత్తుకు బాట
ఈ పొదుపు సూత్రం
తెలియకున్న అవివేకమే...
అమాయకత్వమే అజ్ఞానమే...
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభశుభోదయం..!



