మానవజన్మ ఎక్కడిది?
ఎక్కడిది మిత్రమా?...ఎక్కడిది?
పాఠం లేక...పరీక్ష ఎక్కడిది?
పరీక్ష లేక....ఫలితమెక్కడిది?
పోటీ లేక......ఓటమెక్కడిది?
పందెం లేక...పతకమెక్కడిది?
మెరుపు లేక...మేఘమెక్కడిది?
మేఘం లేక....వర్షమెక్కడిది?
విత్తనం లేక...పంట ఎక్కడిది?
పాత్ర లేక......వంట ఎక్కడిది?
గుడి లేక...గంట ఎక్కడిది?
పొగ లేక...మంట ఎక్కడిది?
తాళి లేక.......పెళ్ళి ఎక్కడిది?
వివాదం లేక...విజయమెక్కడిది?
అమ్మానాన్నలు లేక...
నీకు ఈ మానవజన్మ ఎక్కడిది?



