అడవికి వేటకు వెళ్ళి "వల విసరందే" ఏ పక్షీ చిక్కదు
గురిచూసి బాణం వెయ్యనిదే ఏ జింకా దొరకదు
చేపలవేటకు వెళ్ళి గాలం విసరందే ఏ చేపా చిక్కదు
ఏ అందమైన అమ్మాయైనా "వలపుల వల" విసరందే
నీ వైపు చూడదు. నీ దగ్గరకు రాదు. నీవంటే ఇష్టపడదు
నీకు మనసివ్వదు. నీకు ఐలవ్యూ చెప్పదు. నీతో స్నేహం చెయ్యదు.నీచేతిలో చెయ్యి వెయ్యదు.నీతో ఏడడుగులు నడవదు.
ఏ దైవమైనా భక్తితో మొక్కనిదే నిన్ను ఆశీర్వదించడు
ఏ పూజారైనా గుడిమెట్లు ఎక్కనిదే దక్షిణ వేయనిదే
నిన్ను కరుణించడు కనికరించడు
ఏ విద్యార్థికైనా పరీక్షల్లో ర్యాంకులు రావాలన్నా,ఇంటర్వ్యూలకు అర్హత రావాలన్నా
ఆశించిన ఉద్యోగం దొరకాలన్నా
పాఠాలు క్షుణ్ణంగా చదవవలసిందే
ఏకాపలా కుక్కైనా అరవకుండా కరవకుండా వుండాలంటే
దోచుకోవడానికి ఇంటికి వచ్చిన దొంగ కొన్ని కుక్కబిస్కెట్లు ముందు విసరవలసిందే
ఏ ఉద్యోగైనా బదిలీల ఇక్కట్లు తీరాలనన్నా
పైపైకి మెట్లు ఎక్కాలన్నా ప్రమోషన్లు దక్కాలన్నా
పై అధికారులకు ఆమ్యామ్యాలు అర్పించుకోవలసిందే



